Sunday, March 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅవకాశమొచ్చింది.. లొంగిపోండి

అవకాశమొచ్చింది.. లొంగిపోండి

- Advertisement -

– మావోయిస్టులకు డీజీపీ శివధర్‌రెడ్డి పిలుపు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

”అవకాశమొచ్చింది.. జాప్యం చేయకుండా అజ్ఞాతం వీడండి.. లొంగిపోండి” అని సీపీఐ(మావోయిస్టు) మావోయిస్టులకు రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి ఆదివారం పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మొత్తం 588 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన తెలిపారు. ఇక తెలంగాణకు చెందిన 15 మంది మావోయిస్టులు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులు ప్రభుత్వం ఇచ్చిన సహకారం, ఆర్థిక సాయం, ఇతర వెసులుబాట్లతో తమ తమ గ్రామాల్లో వారి కుటుంబీకులతో కొత్త జీవితాలను గడుపుతున్నారని ఆయన వివరించారు. అజ్ఞాతంలో ఉన్నవారు వెంటనే లొంగిపోయి ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో కొత్త జీవితాలను ప్రారంభించాలనీ, ఈ అవకాశం జారవిడుచుకోరాదని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -