- Advertisement -
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
పద్మశాలి సామాజిక వర్గం రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని రాష్ట్రంలోనే అధిక జనాభా కలిగిన సామాజిక వర్గం పద్మశాలి సామాజిక వర్గం అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. పద్మశాలి సర్పంచులు ఉపసర్పంచుల సన్మానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పద్మశాలికి చెందిన నాయకులు గ్రామ పట్టణ స్థాయిలో ఉన్న పద్మశాలీలను రాజకీయంగా ఎదగడానికి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు గోలి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



