Wednesday, January 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పద్మశాలి పాలక వర్గానికి సత్కారం.

పద్మశాలి పాలక వర్గానికి సత్కారం.

- Advertisement -

– వల్లెంకుంట ఉప సర్పంచ్ కటకం నరేష్ – స్వప్న కు సత్కారం
నవతెలంగాణ-మల్హర్ రావు.
పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఇటీవల స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలుపొందిన పద్మశాలి వర్గానికి చెందిన వారికి మంగళవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని పంచాయితీలలో గెలుపు కైవసం చేసుకున్న వారిని ఘనంగా సన్మానించడం జరిగిందన్నారు. వల్లెంకుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ గా గెలుపొందిన కటకం నరేష్ – స్వప్న పూల మాల , శాలువతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు…
ఈ సన్మాన కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా హాజరైన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, జనగామ అధ్యక్షులు వేముల బాలరాజు గారు, షాయంపేట మాజీ ఎంపీపీ చంద్రప్రకాష్ , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చందా మల్లయ్య , అసోసియేషన్ అధ్యక్షులు దోస్స శివ శంకర్ ,రాష్ట్ర సెక్రెటరీ ఎర్రగుంట శ్రీనివాస్, వల్లకాటి శ్రీనివాస్ , ఆర్గనైజర్ బొమ్మిడల లక్ష్మణ్, ఎలిగేటి దేవేందర్ తో పాటు సంఘ నాయకులు, నాయకురాళ్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -