- Advertisement -
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడలో ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ దేవాలయం (భగవద్గీత మందిరం) లో ధనుర్మాస వ్రత పూజలు వైభవంగా జరుగుచున్నాయి. ఈ ఉత్సవంలో అంతర్భాగంగా రోజు 17వరోజు నాడు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పేరెన్నికగొన్న 12మంది ఆళ్వార్లు అనుగ్రహించిన దివ్య ప్రబంధ అధ్యయన ఉత్సవములు, మరియు శ్రీ నమ్మాళ్వారుల పరమపద ఉత్సవం చాలా వైభవంగా నిర్వహించినారు. యాజ్ఞీకబృందం శ్రీమాన్ ఠంయ్యాల ఫణికుమారాచార్యులు, సునిల్ కుమారాచార్యులు, వరుణ్ కుమారాచార్యులు మొదలైనవారి అధ్వర్యంలో వైభవంగా జరిగినది. ఆలయ చైర్మన్ బండారు కుశలయ్య, ప్రసాద్, గోళ్ళవేణు, సాంబయ్య మొదలైన ఆలయ కమిటీవారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.
- Advertisement -


