– కార్మికుల మృతికి సంతాపం
– క్షతగాత్రులకు త్వరగా కోలుకోవాలి : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పాశమైలారం కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి కార్మికులు చనిపోవడం బాధాకరమనీ, వారి మృతికి సంతాపం తెలుపుతున్నామని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చికిత్స పొందుతున్న కార్మికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడ్డవారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక పరిహారం ప్రకటించిందని తెలిపారు. ఈ తరహా ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలపై పూర్తి పర్యవేక్షణ నిర్వహించాలనీ, ముఖ్యంగా ఫార్మా, కెమికల్ ఇండిస్టీల్లో నిరంతర పర్యవేక్షణ అవసరమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న అనేక గోడౌన్‌లు, వాణిజ్య భవనాలపై కూడా సమగ్ర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. కెమికల్, ఫార్మా పరిశ్రమల్లో మేనేజ్‌మెంట్‌లు, కార్మికులకు ఎప్పటికప్పుడు భద్రతా సూచనలు ఇవ్వాలనీ, ప్రమాదాలను నిరోధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. రాజకీయాలు పక్కనబెట్టి అన్ని పార్టీల నాయకులు బాధితుల పక్షాన నిలబడాలని కోరారు. చికిత్స పొందుతున్న కార్మికులకు, వారి కుటుంబాలకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు తమ పార్టీ తరఫున చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పాశమైలారం ఘటన బాధాకరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES