మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇంటర్‌మీడియట్ , పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచాలని ఉపాధ్యాయులకు రాష్ట్ర మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మహాత్మా జ్యోతిబాఫూలే గురుకులాల పాఠశాలలపై అధికారులు, ప్రిన్సిపల్‌లు , హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం జూమ్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో బీసీ సంక్షేమశాఖ సెక్రటరీ శ్రీధర్, గురుకులాల సెక్రటరీ సైదులు , గురుకులాల ప్రిన్సిపాల్‌లు , హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, ఇతర అధికారులు.ఇంటర్‌మీడియట్, పదోతరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో విద్యార్థుల సన్నద్ధతకు ఉపాధ్యాయుల ప్రత్యేక కార్యాచరణ అమలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
గతేడాది తక్కువ ఫలితాలు సాధించిన పాఠశాలలు ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థుల పరీక్షలు , ఫలితాలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విద్యా సంవత్సరం 294 గురుకుల పాఠశాలల్లో 19,255 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇంటర్‌మీడియట్‌లో 261 గురుకుల కళాశాలల నుంచి 26,812 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేక గ్రూప్‌లుగా విభజించి ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేసీ, స్టడీ అవర్స్ నిర్వహించాలని సూచించారు.
ఉత్తీర్ణతా శాతం పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



