మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన సమానత్వ మార్గాన్ని యువత ఆచరణలో పెట్టాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో సచివాలయంలో మహనీయుల జయంతి సందర్భంగా సమానత్వ స్వరానికి యువత నినాదం, బ్లూ-గ్రీన్-బ్లాక్ కవాతు పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ మాదిగ విద్యార్థి జేఏసీ, తెలంగాణ స్టూడెంట్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14 వ తేదీన కవాతను నిర్వహించనున్నారు. అంబేద్కర్ ఆశయాలు ప్రజల జీవితాల్లో ప్రతిఫలించాలని ఆయన ఆకాంక్షించారు. ఆ దిశగా సామాజిక న్యాయం, సమానత్వం సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పిడమర్తి రవి, తెలంగాణ మాదిగ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు జోగు గణేష్ గిరిజన మహాశక్తి రాష్ట్ర అధ్యక్షులు చందర్ నాయక్, తెలంగాణ యూత్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు నక్క మహేష్ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు.
సమానత్వ మార్గాన్ని ఆచరణలో పెట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



