Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్, కాంట్రాక్టు లెక్చరర్స్ పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్, కాంట్రాక్టు లెక్చరర్స్ పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 145 డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న 1940 మంది అత్యధిక అధ్యాపకులు యొక్క మరియు 841 కాంట్రాక్ట్ లెక్చరర్స్ యొక్క పెండింగులో ఉన్నటువంటి జీతాలను వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా 2025- 26 అకాడమిక్ సంవత్సరానికి గాను పేద విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చాలామంది అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది. ఈ విద్యార్థులకు నాన్నమైన విద్య అందాలంటే సకాలంలో కాంట్రాక్టు అధ్యాపకులకు, అతిథి అధ్యాపకులకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ప్రతి నెల జీతాలు విడుదల చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని అన్నారు.

అదేవిధంగా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినప్పటికీ పెండింగ్ జీతాలు విడుదల చేయలేదు కావున వెంటనే ఉన్నత విద్యాశాఖ అధికారులు అతిథి అధ్యాపకుల, కాంటాక్ట్ అధ్యాపకుల యొక్క జీతాలను విడుదల చేసి, ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని తెలంగాణ డిగ్రీ లెక్చరర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చింతల కిషోర్ కుమార్ ప్రభుత్వమును ఉన్నత విద్యాశాఖ అధికారులను కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad