దరఖాస్తు చేసుకున్న పింఛన్దారులకు మంజూరు చేయాలి
నవతెలంగాణ – రామారెడ్డి
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పింఛను పెంచి అందజేయాలని ఎమ్మార్వో ఉమా లత కు, ఎంపీడీవో నాగేశ్వర్ కు ఎమ్మార్పీఎస్, వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. సోమవారం ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులు కొత్తొల యాదగిరి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు, వికలాంగులకు రూ.6000, వృద్ధులకు, బీడీ కార్మికులకు, చేనేత, గీత కార్మికులకు రూ.4000 పెంచి అందించాలని, శాశ్వత వికలాంగులకు రూ.15000 అందించాలని, దరఖాస్తు చేసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందించాలని ప్రభుత్వానికి సూచించారు. 22 నెలలైనా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొత్తోల యాదగిరి, మండల అధ్యక్షులు పెనుగుర్తి రాజ నరసయ్య, నాయకులు బాణాపురం సాయిలు, లావణ్య, సుజాత, చింతకుంట సాయి వరుణ్, ఆకుల రాజయ్య, కుమ్మరి అంజయ్య, రమేష్, తదితరులు ఉన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన పింఛను అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES