Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాచారం జనం చూపు.. చేవూరి స్వప్న-దేవరాజు వైపు.!

నాచారం జనం చూపు.. చేవూరి స్వప్న-దేవరాజు వైపు.!

- Advertisement -

విజయపథంలో దూసుకపోతున్న స్వతంత్ర్య అభ్యర్థి
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని నాచారం జనం చూపు గ్రామ స్వతంత్ర్య సర్పంచ్ అభ్యర్ధిగా బరిలో నిలిచిన చేవూరి స్వప్న-దేవరాజు వైపు చూస్తున్నట్లుగా గ్రామంలో చర్చనీయంగా మారింది. జనం బ్యాట్ వైపు చూడడంతో స్వప్న-దేవరాజు దంపతులు విజయపథంలో దూసుకెళుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా ఏ వార్డుకు,గల్లికి వెళ్లిన ప్రజలు ఆదరిస్తున్నారు. తమను ఆదరించి తమ బ్యాట్ గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తన మేనిపిస్టో పొందపర్షిన తాగునీటి సమస్య, భూ సమస్యలు, మల్లన్న గుట్టతోపాటు పలు ఆలయాల అభివృద్ధి, యువతకు ఓపెన్ జిమ్, మహిళలకు కుట్టు మిషన్లు, పాలకేంద్రం, జిపిలో ప్రిజర్ బాక్స్ ఏర్పాటు, వీది లైట్స్, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణాలు తదితరవి అమలు చేస్తామని హమీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -