నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని గ్రామాలపై రాత్రి వేళలో తిరుగుతున్న డ్రోన్లను చూసి ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని నాగిరెడ్డిపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ రావి కిరణ్ రెడ్డి అన్నారు. గత నాలుగు రోజుల నుంచి నాగిరెడ్డిపల్లి, నమాత్ పళ్లి, నందనం తో పాటు బోడగుట్ట, ఆశ్రమం పై రాత్రి 8 గంటల నుంచి మధ్యరాత్రి 12 గంటల వరకు గుర్తు తెలియని వ్యక్తులు ఐదు డ్రోన్ కెమెరాలను గ్రామాలపై విడిచి పర్యటింప చేస్తున్నారని తెలిపారు. గ్రామాలపై తిరిగే డ్రోన్లను చూసి ఆయా గ్రామాల ప్రజలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో భయాందోళనకు గురవుతున్నారని, ఈ డ్రోన్లు పంపించే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.
భయభ్రాంతులకు గురవుతున్న గ్రామాల ప్రజలు….
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES