– మధ్యప్రదేశ్ తహసీల్దార్లు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సీఎం ప్రజావాణి పని తీరు పట్ల మధ్యప్రదేశ్ తహసీల్దార్లు సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌లో జరిగిన సీఎం ప్రజావాణిని మధ్యప్రదేశ్ రాష్ట్ర తహసీల్దారులు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజావాణి అమలు జరుగుతున్న తీరును వారు పరిశీలించారు. వివిధ విభాగాల అధికారులను పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఐడియా తమలో స్ఫూర్తిని నింపిందన్నారు. ఇలాంటి బృహత్ కార్యక్రమం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని తమ మనోగతాన్ని ఆవిష్కరించారు. ఇదే తరహా ప్రక్రియను తమ రాష్ట్రంలో చేపట్టేందుకు ప్రభుత్వ, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి డాక్టర్ జి.చిన్నారెడ్డి, రాష్ట్ర అధికారి దివ్య దేవరాజన్ వారికి వివరించారు.
అనంతరం సీఎం ప్రజావాణిలో 380 దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి శాఖకు సంబంధించి 143, రెవెన్యూ శాఖకు సంబంధించి 38, ఇందిరమ్మ ఇండ్ల కోసం 120, ప్రవాసి ప్రజావాణికి 05 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 74 దరఖాస్తులు అందాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సూర్యప్రకాష్, ఏసీపీ ఉమేందర్, ప్రవాసి ప్రజావాణి సమన్వయకర్త బొజ్జా అమరేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీఎం ప్రజావాణి’ పనితీరు భేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



