నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పెద్దకొడప్ గల్ కేంద్రంలోని పోలీసు స్టేషన్ లోని సిబ్బంది విధుల నిర్వహణ సంతృప్తికరంగా ఉందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. మంగళవారం మండలంలోని పోలీసు స్టేషన్లో వార్షిక సంవత్సర తనికేలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదాలు జరగకుండా నిజాంసాగర్ మండల్ నర్సింగరావుపల్లి చౌరస్తా నుండి మద్నూర్ బార్డర్ వరకు రాత్రివేళలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రమాదాలు దొంగతనాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని వాహనాల వేగాన్ని తగ్గించడానికి జాతీయ రహదారి సిబ్బందితో సంప్రదించి వేగాన్ని తగ్గించే విధంగా చర్యలు చేపడతామని అదేవిధంగా విభాగాల రికార్డులను పరిశీలించారు. కేసులు నమోదు వాటి పరిష్కారం తీరు చాలా బాగుందని సంతృప్తిని వ్యక్తం చేశారు.ముఖ్యంగా నేరాల నియాత్రణ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని సమస్యల పరిష్కార దిశలో కృషి చేస్తామని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్లను తనికేలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ విఠల్ రెడ్డి, సీఐ నరేష్, ఎస్సై మహేందర్, సిబ్బంది ఉన్నారు.
పోలీసు సిబ్బంది విధుల నిర్వహణ సంతృప్తికరం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES