నవతెలంగాణ – మిరుదొడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామ జాతరలో టిక్కెట్ లేదు అనే కారణంగా ఆలయంలోకి ప్రవేశించిన బీసీ చాకలి కుటుంబానికి చెందిన కుటుంబాన్ని గ్రామ సర్పంచ్, రెడ్లు అత్యంత పాశవికంగా మహిళలపై దాడి చేసి,రెండు నెలల పసికందు బేబీ మౌనికను కాళ్ళతో తొక్కి చంపిన సంఘటన మానవ సమాజానికే సిగ్గు చేయటం ధర్మసమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంఘటనలో నిందితులుగా ఉన్న తుకారాం రెడ్డి,సతీష్ రెడ్డి,మాధవ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,మధుసూధన్ రెడ్డి,అరెస్ట్ చేసి చట్ట పరంగా శింక్షించాలనీ డిమాండ్ చేశారు.పరారీలో ఉన్న నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచి వారికి తగిన శిక్ష పడేలా చూడాలనీ అన్నారు.
అగ్రకుల దురహంకార ఆధిపత్యంతో జరిగిన ఈ దాడిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా మరోసారి ఇలాంటి సమస్యలు పురవృతం కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే బాధ్యత తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి ఘటన జరగడం దీనిని సీరియస్ గా తీసుకోలేకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి నిందితులకు శిక్ష పడేలా చేయాలని అన్నారు. లేకపోతే ధర్మసమాజ్ పార్టీ మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం తెలిపారు.



