Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుమ్మెర నిందితులను కఠినంగా శిక్షించాలి

కుమ్మెర నిందితులను కఠినంగా శిక్షించాలి

- Advertisement -

– చాకలి ఐలమ్మ విగ్రహం ముందు కొవ్వొత్తులతో  నిరసన 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన అమానుష సంఘటనకు బాధ్యులైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఉప్లూర్ రజక సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి మండలంలోని ఉప్లూర్ గ్రామంలో నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానిక రజక సంఘం ఆధ్వర్యంలో సాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవుడు దర్శనానికి వెళ్తే సహించనీ అగ్రకులాల పెత్తందార్ల దాష్టికానికి పసిపాప బలవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

కీర్తన కుటుంబంపై దాడి చేసి రెండు నెలల పసిపాపను హత్య చేసిన పెత్తందారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పసిపాపను హత్య చేసిన పెత్తందారులను వెంటనే అరెస్టు చేయాలని, వారిపై హత్య నేరం కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. సంఘటనకు బాధ్యుడైన వ్యక్తిని సర్పంచ్ పదవి నుండి తొలగించి, ఎస్ఐ, సిఐలను వెంటనే సస్పెండ్ చేయాలని ఉప్లూర్ రజక సంఘం సభ్యులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పసిపాప మృతి పట్ల సంతాపం తెలుపుతూ కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -