- Advertisement -
నవతెలంగాణ – తుంగతుర్తి
విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి మేలు చేసే ఎంతోమంది ఉన్నత వ్యక్తులను తయారు చేయడమే కాదు, విద్యార్థుల కుటుంబాలకు ఆపద సమయాల్లో అండగా ఉండి నిరూపించారు గొట్టిపర్తి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామానికి చెందిన జలగం రవి(41) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. రవి కుమార్తె రజిత స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయ బృందం శనివారం రజిత ఇంటికి వెళ్లి పరామర్శించి, రూ.5000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీహరి, ఉపాధ్యాయ బృందం పుల్లయ్య, తిరుమల రెడ్డి, రమేష్, సురేందర్, కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



