Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక సంస్థల్లో ఎగిరేది గులాబీ జెండానే

స్థానిక సంస్థల్లో ఎగిరేది గులాబీ జెండానే

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
స్థానిక సంస్థల ఎన్నికలో ఎగిరేది గులాబీ జెండానే అని నాగార్జున సాగర్ మాజీ శాసన సభ్యులు నోముల భగత్ కుమార్ అన్నారు. శుక్రవారం మండలం లోని చింతపల్లి గ్రామానికి చెందిన  15 కుటుంబాలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి మాజీ ఎంఎల్ ఏ నోముల భగత్ గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించి మాట్లాడారు. గత రెండేళ్లుగా కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని, ఏ ఒక్కరికీ మేలు జరగలేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, నేడు కాంగ్రెస్ పాలనలో తిరోగమనంలో పయనిస్తోందని తెలిపారు.

కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు కేవలం ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికే పరిమితమయ్యాయని అన్నారు.వృద్ధులకు రూ.4000 పెన్షన్, మహిళలకు మహాలక్ష్మి పథకం, విద్యార్థులకు విద్యా భరోసా, నిరుద్యోగులకు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు, ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీలు వంటివి  అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శలు చేశారు. లోవోల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని
కొనుగోలు కేంద్రాలు సక్రమంగా లేక, ధాన్యం దళారుల పాలవుతున్నదని అన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అందరూ కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

అనంతరం బీఆర్ఎస్ లో చేరిన కంచర్ల రంజిత్ రెడ్డి, కట్టెబోయేనా నరేష్ యాదవ్, కాసాని మహేష్, బొక్క హనుమంత్, బొక్క కార్తీక్, బద్రి మహేష్, ఎస్కే అబ్బాస్, చిన్నపాక విజయ్, కంచర్ల శేఖర్, కట్టేబోయినా కోటేష్, బద్రి శ్రీను, గుండూరి కోటేష్, ఎస్ కే. ఫయాజ్, వళ్ళోజు నర్సింహా చారి లను పార్టీ లోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జాటావత్ రవి నాయక్, నాయకులు షైక్ అబ్బాస్, పొదిల్ల శ్రీనువాస్, జానపాటి ఎల్లయ్య, సిరందాసు రమేష్, గొర్ల మహేష్, దండ నరేందర్ రెడ్డి, మెండే లింగయ్య, చిన్నపాక రవి తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -