Wednesday, January 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాలలో గులాబీ జెండా ఎగరడం ఖాయం: చల్లా ధర్మారెడ్డి 

పరకాలలో గులాబీ జెండా ఎగరడం ఖాయం: చల్లా ధర్మారెడ్డి 

- Advertisement -

కాంగ్రెస్‌కు షాక్! బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు
నవతెలంగాణ – పరకాల 

వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పరకాల గడ్డపై గులాబీ జెండా ఎగరడం చారిత్రక అవసరమని, అది అక్షరాల నిజం కాబోతోందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పరకాల పట్టణంలోని 4వ,16వ వార్డులకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి చల్లా ధర్మారెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని, ఆ పార్టీ విధానాలపై విరక్తి చెందే నేతలు బిఆర్ఎస్ వైపు వస్తున్నారని విమర్శించారు. “బిఆర్ఎస్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. పరకాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కార్యకర్తలు నడుం బిగించాలి” అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకత్వ లోపాలు, స్థానిక సమస్యలపై వారి నిర్లక్ష్య వైఖరి వల్లే తాము పార్టీ వీడుతున్నట్లు చేరిన నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వారిలో ఏకు రమేష్, మోరే రాజకుమార్, గోవిందు రాజేందర్, మోరే సారంగపాణి, బొచ్చు దేవరాజు, గోవింద రాజు, పసుల పవన్ కళ్యాణ్, కోగిల శ్రీకాంత్, గోవింద అజయ్, నిశాంత్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -