Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బస్టాండ్ లో టాయిలెట్లు లేక మహిళల నానా అవస్థలు

బస్టాండ్ లో టాయిలెట్లు లేక మహిళల నానా అవస్థలు

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో మహిళలు వాష్ రూంలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాష్ రూమ్ లు నిర్మించడానికి ఎంపీ నిధులు రూ.10 లక్షలు 8 ఏళ్ల క్రితం మంజూరైనాయి. అయితే సదరు గుత్తేదారుడు పనులు ప్రారంభించి, నిధులు సరిపడా మంజూరవ్వలేదని అర్థాంతరంగా పనులను నిలిపివేశాడు. నాటి నుండి నేటి వరకు వాష్ రూమ్ ల సమస్య తీరకపోవడంతో మహిళా ప్రయాణికులు చెట్లపొదలలో, ముళ్ళ పొదలలో, బహిరంగ నిర్మానుష్య ప్రాంతాలలో అడ్డంగా వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ఇలా ఏండ్ల తరబడి మహిళలు నానా అవస్థలు పడుతూ వస్తున్నారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వెరసి మహిళల ఆరోగ్యం దెబ్బతింటోంది. అయినా అధికారులు, ప్రజా పతినిధులు ఎందుకు పట్టించుకునే ప్రయత్నాలు చేయడం లేదని, మహిళలు వాపోతున్నారు. భారత దేశంలో మహిళలకు సముచిత స్థానం కల్పించే దేశం అనేది ఒట్టి మాటలకే పరిమితమా.. ప్రశ్నిస్తున్నారు. మహిళలకు గౌరవం లభించలేదనడానికి, తలదించుకునే విధంగా ఉందనడానికి జుక్కల్ బస్టాండే నిదర్శనం. ఇక్కడ మా గోడు పట్టించుకునే వారే లేరని మహిళలు ఆవేదన చెందుతున్నారు. ఒక్క బస్టాండ్ లోనే కాక, ప్రభుత్వ కార్యాలయాలలో కూడా వాష్ రూమ్లు లేక ఇలా మహిళ అధికారులు ఈ సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతి నిధులు, ఆర్టీసీ అధికారులు చొరవ తీసుకొని మహిళా ప్రయాణికుల వాష్ రూమ్ సమస్యను వెంటనే తీర్చి, వారికి గౌరవించుకుందామని మండల వాసులు అంటున్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad