నవతెలంగాణ కంఠేశ్వర్
నిజామాబాదు పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాదు ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలోని అన్నీ ఈద్గాలు ప్రధాన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య శనివారం పర్యవేక్షించారు.

ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ సాయి చైతన్య మాట్లాడితు.. రంజాన్ పండుగ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించడము జరిగింది అని, ప్రజలకు క్షేత్రస్థాయి నుండి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ట్రాఫిక్ నియంత్రణ పార్కింగ్, భద్రత చర్యలను ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

పండుగ దృష్ట్యా మార్కెట్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో షీ టీమ్స్ ద్వారా నిఘా ఉంచడంతో పాటు, సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరూ శాంతియుతంగా, సోదరభావంతో పండుగను జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ ఈద్గాల వద్ద ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరం లొ శాంతినగర్ ఈద్గాల మదిన ఈద్గాల బోధన్ లోని నర్సి రోడ్డు ఈద్గాలను పోలీస్ కమిషనర్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం లో నిజామాబాద్ ఎ.సి.పి శ్రీ ప్రకాష్ , బోధన్ ఏ.సి.పి శ్రీనివాస్ రెడ్డి , ఆర్మూర్ ఎ.సి.పి వెంకటరెడ్డి, సిఐలు , ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.




