Sunday, April 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్టిజన్ల సమ్మెపై పోలీసుల నిర్భందం సరికాదు

ఆర్టిజన్ల సమ్మెపై పోలీసుల నిర్భందం సరికాదు

- Advertisement -

వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి : సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిజన్‌ కార్మికుల సమ్మెపై పోలీసుల నిర్భంధం సరికాదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని చట్టబద్దంగా నోటీస్‌ ఇచ్చినా స్పందిచక పోవడంతోనే సమ్మె బాట పట్టారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఆర్టిజన్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రావాల్సింది పోయి పోలీసులతో ఉద్యమాన్ని అణచివేయ డానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్యోగం నుంచి తొలిగిస్తామని ఎస్మా, డిస్మిస్‌ పేరిట బెదిరింపుల పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టిజన్స్‌ జేఏసీ శనివారం చేపట్టిన చలో పాల్పంచ కార్యక్రమానికి వెళ్తున్న కార్మికులను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్ట్‌ చేశారని విమర్శించారు. ఆర్టిజన్‌ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జేఏసీతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -