Friday, February 6, 2026
E-PAPER
Homeఆటలుమార్చి 23 నుంచి పోలీసు ఫుట్‌బాల్‌ టోర్నీ

మార్చి 23 నుంచి పోలీసు ఫుట్‌బాల్‌ టోర్నీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
ఆల్‌ ఇండియా పోలీసు ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు మార్చి 23 నుంచి హైదరాబాద్‌లో జరుగుతాయని రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి తెలిపారు. డి.ఎన్‌ మాలిక్‌ స్మారకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో దేశవ్యాప్తంగా 53 జట్లు పోటీపడతాయని, ఇందులో కేంద్ర రిజర్వ్‌ పోలీసు బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు విభాగాల జట్లు ఉంటాయని ఆయన వెల్లడించారు. సుమారు 2100 మంది క్రీడాకారులు, అధికారులకు వసతి, భోజనం ఏర్పాట్లతో పాటు పోటీల నిర్వహణకు, ప్రాక్టీస్‌ మ్యాచ్‌లకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. గచ్చిబౌలి ఫుట్‌బాల్‌ స్టేడియం, ఆర్‌బీవీఆర్‌ఆర్‌ పోలీసు అకాడమీ గ్రౌండ్‌లో మ్యాచ్‌లు జరుగనుండగా.. ఏప్రిల్‌ 5న గచ్చిబౌలిలో ఫైనల్స్‌ జరుగుతాయి. పోటీల సన్నాహాక కమిటీ సమావేశం గురువారం డీజీపీ కార్యాలయంలో జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -