- Advertisement -
– పోలింగ్ నిర్వహణలో అప్రమత్తత పాటించాలి
– ఎంపీడీఓ అప్పారావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
రాబోవు స్థానిక ఎన్నికల్లో ఎన్నికల నియమావళి ప్రకారం ప్రతీ పోలింగ్ అధికారి తమ విధులు నిర్వహించాలని ఎంపీడీఓ అప్పారావు అన్నారు. పోలింగ్ ప్రక్రియను నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులకు శనివారం స్థానిక గిరిజన భవన్ లో పోలింగ్ కేంద్రాలు నిర్వహణ,సజావుగా పోలింగ్ నిర్వహణ కోసం ఒక్క రోజు అవగాహన శిబిరం నిర్వహించారు. 436 మందికి గాను 340 హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -