Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్నిరుపేదలకు ఇంటి స్థలాలతో పాటు ఇండ్లు నిర్మించివ్వాలి

నిరుపేదలకు ఇంటి స్థలాలతో పాటు ఇండ్లు నిర్మించివ్వాలి

- Advertisement -

గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేతావత్ రాందాస్ నాయక్
నవతెలంగాణ – జన్నారం

జన్నారం మండలంలోని జన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని  సర్వే నెంబర్ 72,73, 74, లో గల మూడు ఎకరాల  ప్రభుత్వ సీలింగ్ భూమిలో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేతావత్ రాందాస్ నాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని జన్నారం గ్రామపంచాయతీకి చెందిన ఇల్లులేని నిరుపేదలతో కలిసి  స్థానిక బస్టాండ్ నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అనంతరం తాసిల్దార్ కు వినతి పత్రం అందించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ దున్నేవాడికే భూమి ఇవ్వాలన్నారు.

ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వెంటనే వారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకుంటే  గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి, దారింగుల ఎల్లయ్య, జిల్లా సహాయక కార్యదర్శి   బోడ కిషన్, జిల్లా ఉపాధ్యక్షులు  ఎనుముల నరసయ్య  , జిల్లా నాయకులు సున్నం రాజమౌళి దేవరకొండ సంధ్య, మోతే పురుషోత్తం కురిసింగ ఆనంద్ కట్టేకోల శాంతవ్వ, మహిళలు ఇల్లు లేని నిరుపేదలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad