ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభోత్సవం..
ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
పేదలు ఆకలితో అలమటించకూడదన ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటీన్ ద్వారా టిఫిన్ భోజనం సదుపాయాన్ని ఏర్పాటు చేసిందని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. సోమవారం జిహెచ్ఎంసి గోషామహల్ సర్కిల్ -14 పరిధిలోని గాంధీభవన్ ఎదురుగా ఉన్న ఇందిరా క్యాంటీన్ ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ… పేదల ఆకలి తీర్చాలని ఉద్దేశంతో ఇందిరా క్యాంటీన్ల లో ఇకపై పొద్దున మిల్లెట్ టిఫిన్స్.. పగలు భోజనం… రూ.5 కే ప్లేట్ అల్పాహారం తమ ప్రభుత్వం అందిస్తుందన్నారు.
జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ ఉమా ప్రకాష్ మాట్లాడుతూ.. తమ సర్కిల్లో మూడు ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. జిహెచ్ఎంసి కార్యాలయం వద్ద, గాంధీభవన్ ఎదురుగా, ఉస్మానియా ఆసుపత్రి మొదటి గేటు వద్ద వద్ద ఏర్పాటు చేసాం అన్నారు ఈ క్యాంటీన్ లలో కూర్చొని తినే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ఈ ఈ రాధిక, జిహెచ్ఎంసి అసిస్టెంట్ హెల్త్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ, రాంబాబు, ఏఈ మహేందర్, హరే రామ హరే కృష్ణ ప్రతినిధులు, జిహెచ్ఎంసి వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.