Wednesday, November 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపేదలకు నాణ్యమైన ఉచిత బియ్యం అందాలి

పేదలకు నాణ్యమైన ఉచిత బియ్యం అందాలి

- Advertisement -

– రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మెన్‌ గోలి శ్రీనివాసరెడ్డి
– నర్సాపూర్‌లో ఫుడ్‌ కమిషన్‌ సభ్యుల తనిఖీలు
నవతెలంగాణ-నర్సాపూర్‌

ప్రతి పేదోడికీ నాణ్యమైన ఉచిత బియ్యం పారదర్శకంగా అందించాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మెన్‌ గోలి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలోని రేషన్‌ దుకాణాన్ని, పట్టణ సమీపంలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌తో పాటు రెడ్డిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలను రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ కమిటీ సభ్యులు భూక్యా జ్యోతి ఇతర సభ్యులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. రెడ్డిపల్లి గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో నాణ్యత సరిగ్గా లేదని నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి సంజాయిషీ ఇవ్వాలని డీఈఓను ఆదేశించారు. భద్రత, నాణ్యత, ప్రారంభ నిల్వలు, ప్రభుత్వ పథకాల అమలు వంటివి పరిశీలించారు. అనంతరం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద రేషన్‌ డీలర్లకు న్యాయం జరిగేలా చూసుకోవడానికి రేషన్‌ బియ్యం బ్యాగుల లెక్కింపు ఆధారంగా కాకుండా కచ్చితమైన బరువు ఆధారంగా పంపిణీ చేయాలన్నారు. ప్రతి పేదోడికి కడుపు నింపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని సరఫరా చేస్తుందన్నారు. దీన్ని క్షేత్రస్థాయిలో ప్రతి ఒకరికి పారదర్శకంగా సరఫరా చేసే విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. ప్రతి రేషన్‌ షాపులో వస్తువుల నిల్వ పంపిణీ నమోదు పద్ధతులు, కార్డుదారులకు సరైన విధంగా సరుకులు అందిస్తున్నారా అని రేషన్‌ డీలర్లను అడిగి తెలుసుకున్నారు.

పిల్లల పౌష్టికారం నాణ్యత పరిశీలన
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అభివృద్ధి సేవల నాణ్యతను పరిశీలించారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమం, విద్యా వసతులు, పిల్లల హాజరు, నిర్వహణను తనిఖీ చేసి.. అధికారులకు సూచనలు చేశారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం నాణ్యతతో అందించాలని, అందుకు జిల్లా అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులు సమన్వయం ఉండేలా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో రాధాకృష్ణ, బీడబ్ల్యూఓ హేమా భార్గవి, సివిల్‌ సప్లరు అధికారి నిత్యానంద, నర్సాపూర్‌ ఆర్డీవో మైపాల్‌ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -