నవతెలంగాణ – రాయపర్తి
ప్రజా కవి కాళోజి అక్షర యోధుడు అని తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కాళోజి జయంతి వేడుకను పరిష్కరించుకొని ఆయన చిత్రపురానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడిన మహావ్యక్తి ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని కొనియాడారు. పుట్టుక, చావు తప్ప బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు కాళోజి.. తన భావాలను తెలంగాణ యాసలో.. సులభంగా అర్ధమయ్యే భాషలో వర్ణించిన మేధావి కాలేజీ అని అభివర్ణించారు.
తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించడమే కాకుండా యేటా ఆయన పేరిట సాహితీ పురస్కారాలను అందిస్తూ గౌరవించడం సంతోషకరమన్నారు. మండలం కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో, వివిధ ప్రభుత్వం పాఠశాలలో కాలేజీ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఐ చంద్రమోహన్, సంధ్య రాణి, సీనియర్ అసిస్టెంట్ కిరణ్ కుమారి, జూనియర్ అసిస్టెంట్ మురళి కృష్ణ, నర్సయ్య, శిరీష, స్వాతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజాకవి కాళోజి అక్షర యోధుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES