Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలి 

 నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలి 

- Advertisement -

– టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కలిసిన లింగంగౌడ్
నవతెలంగాణ – మిర్యాలగూడ 
: త్వరలో నియామకం చేపట్టబోయే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలని కోరుతూ శనివారం  టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జెండాలు మోసేది, జిందాబాద్ లు కొట్టేది, బ్యానర్లు కట్టేది మొత్తం బీసీ కులాలకు చెందిన వారేనని కానీ పదవులు అనుభవించేది మాత్రం వేరే  సామాజిక వర్గానికి చెందిన వారని అన్నారు.ఎన్నో సంవత్సరాలుగా అధికారంలో ఉన్న లేకున్నా ఏ పదవి ఆశించకుండా పార్టీలోనే కష్టకాలంలో ఉన్నటువంటి బీసీకి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు.నల్గొండ ఎంపీ ఎమ్మెల్యేలలో కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి లేరని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -