Friday, October 31, 2025
E-PAPER
Homeసినిమాశక్తివంతమైన 'మహాకాళి'

శక్తివంతమైన ‘మహాకాళి’

- Advertisement -

దర్శకుడు, నిర్మాత ప్రసాంత్‌ వర్మ, ఆర్‌కేడీ స్టూడియోస్‌తో కలసి నిర్మిస్తున్న చిత్రం ‘మహాకాళి’. ఈ సినిమా నుంచి లీడ్‌ ఫేస్‌ను మేకర్స్‌ పరిచయం చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో భూమి శెట్టి ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ఇప్పటికే 50%కి పైగా షూట్‌ పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్‌పై ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. సాధారణంగా నాన్‌-స్టార్‌ సినిమాలకు ఇంత భారీ బడ్జెట్‌ వెచ్చించేందుకు ప్రొడ్యూసర్లు వెనుకాడుతారు. కానీ ‘మహాకాళి’ టీమ్‌ మాత్రం ఈ సాహసాన్ని చేసి చూపింది. పలువురు ఏ లిస్టు నటీమణులు సూపర్‌ హీరో పాత్రను పోషించడానికి ఆసక్తిని వ్యక్తం చేసినప్పటికీ, కథ సారాన్ని నిజంగా ప్రతిబింబించగల కొత్త ముఖం కావాలనే నిశ్చయంతో ఆ పాత్రకు సరిపడే డార్క్‌ స్కిన్‌ టోన్‌, వ్యక్తిత్వం, అన్నిరకాలుగా పర్ఫెక్ట్‌గా సూట్‌ అయ్యే భూమి శెట్టిని ఎంపిక చేశారు. ఆర్‌ఎకే దుగ్గల్‌, రివాజ్‌ రమేష్‌ దుగ్గల్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రశాంత్‌ వర్మ కాన్సెప్ట్‌, పూజ కొల్లూరు దర్శకత్వం కలసి గ్రేట్‌ విజువల్‌ వండర్‌ను అందించబోతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -