అగ్ర కథానాయకుడు ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’. ఈ సినిమా ప్రభాస్ తన కెరీర్‌లోనే మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. మేకర్స్ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఒక పవర్‌ఫుల్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది ‘ఇండియన్ సినిమా…. మీ ఆజాను బాహుడిని చూడండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026’ అని సందీప్ రెడ్డి వంగా ట్వీట్ చేశారు. ‘మీరు ఇప్పటివరకూ ఉన్న దానిని ప్రేమించారు. ఇక నుంచి మీకు తెలియనిదానితో ప్రేమలో పడండి’ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది.
ఒళ్లంతా గాయాలతో, బ్యాండ్-ఎయిడ్‌లు కట్టుకుని ప్రభాస్ వెనక్కి తిరిగి నిలబడి వున్న రా అండ్ రస్టిక్ పోస్టర్ అదిరిపోయింది. పొడవాటి జుట్టు, గడ్డం పాత్ర ఇంటెన్సిటీని మరింత పెంచుతోంది.
అతని పక్కన ఉన్న త్రిప్తి డిమ్రీ ఒక ఎమోషనల్ మూమెంట్‌లో అతని సిగరెట్‌ను వెలిగిస్తూ కనిపించడం మరింత ఆసక్తిని పెంచింది. ఈ ఫస్ట్ లుక్, ప్రభాస్ పోషిస్తున్న పాత్రను ఇంటన్సిటీ, పవర్‌ని తెలియజేస్తోంది. హింస, అంతర్గత సంఘర్షణ చుట్టూ తిరిగే ఒక ఫెరోషియస్ కథను ప్రజెంట్ చేస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ ప్రారంభ దశలో ఉంది. ప్రభాస్ ఇప్పటికే తన ఎగ్జైట్‌మెంట్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడంతో ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెరిగాయి. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ నటిస్తున్న ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా 9 భాషల్లో రిలీజ్ కానుంది.
పవర్‌ఫుల్ ‘స్పిరిట్’ ఫస్ట్‌లుక్ రిలీజ్
- Advertisement -
- Advertisement -



