– పట్టించుకోని జీపీ అధికారులు..
నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని జుక్కల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గేటు ఎదురుగా ఉన్న పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో పాఠశాల ఆవరణ మొత్తం గుంతలు పడి బురదమయమైంది. ఈ హైస్కూల్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఎదురుగా ఉంది. అయినా జీపీ అధికారులు కానీ, పాలకులు కానీ పట్టించుకున్న పాపాన పాలేదు. ఈ మధ్య గత వారం రోజులుగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నందున హైస్కూల్ ఎదురుగా మరీ అపరిశుభ్రత ఎక్కువైంది. అటుగా వెళ్తున్న వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదరుర్కొంటున్నారు. ఈ క్రమంలో పాఠశాల సిబ్బంది కూడా జీపీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. అయినా వారినుండి ఎలాంటి స్పందన రాలేదు. దీని మూలంగా బురదలో వాహనదారులు, ప్రజలు జారి పడ్డ దాఖలాలు లేకపోలేదు. దీంతో ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
జుక్కల్ జెడ్పీ హైస్కూల్ ఆవరణ బురదమయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES