- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: శబరిమలలో అయ్యప్పస్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆమె అక్కడికి వెళ్లారు. పంబానుంచి సన్నిధానం వరకూ తన అత్యవసర వాహనంలో ప్రయాణించారు. అనంతరం ఆలయ పవిత్రత, ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం ఆమె అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఇరుముడితో 18 మెట్లెక్కి ఆలయ ఆచారాలు, తాంత్రిక నియమాలకునుగుణంగా స్వామి వారికి రాష్ట్రపతి ముర్ము పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి తీర్ధప్రసాదాలను రాష్ట్రపతికి శబరిమల ప్రధాన అర్చకుడు, ఇతర ఆలయ అధికారులు అందజేశారు. అయ్యప్ప సేవలో పాల్గొన్న తొలి మహిళగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలవడం విశేషం.
- Advertisement -