Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అవగాహనలేమితోనే ప్రెస్ మీట్ పెట్టారు..

అవగాహనలేమితోనే ప్రెస్ మీట్ పెట్టారు..

- Advertisement -

సీడీఆర్ తీస్తే వ్యక్తిగత హక్కులకు భంగం కలుగదా.. ధారా భాస్కర్ 
నవతెలంగాణ – నవాబు పేట
తనపై అవగాహన లేమితో అక్రమార్కుల ఒత్తిడితో, ప్రోత్సాహంతో యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు అని టీపీసీసీ కో ఆర్డినేటర్ ధారా భాస్కర్ అన్నారు. తన వ్యక్తిగత కాల్ డేటా (సీడీఆర్) తీస్తే వ్యక్తిగత హక్కులకు భంగం కలుగదా అని ఆరోపించారు. తాను ఎంఎల్ఏ అనిరుధ్ రెడ్డిపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు కానీ ఎవరో యూత్ కాంగ్రెస్ నాయకుల వెంట ఉండి తప్పుడు మాటలు మాట్లాడిస్తూ, వ్యక్తిగతంగా హద్దులు దాటి మాట్లాడిస్తునారు అని,తాను పార్టీ కార్యకర్తలకు జరిగిన అన్యాయాలను మాత్రమే ఖండించానని, స్వంత పార్టీలో చిచ్చురేపుతున్న విషయాలను మాత్రమే ఖండించానని గుర్తు చేశారు.

పార్టీలో క్రమశిక్షణా చర్యలు ఎవరు హద్దు దాటుతున్నారో అందరికి తెలుసు అని, ఏమి తెలియదు అన్నట్లు వ్యవహారించడం తగదని అన్నారు.తానుకూడా పార్టీ కార్యకర్తలకు జరుగుతున్న ఇబ్బందులను నేరుగా వారి దగ్గరకు వెళ్లి పూర్వాపరాలు తెలుసుకుని మాట్లాడుతున్నానని తెలిపారు.స్వంత పార్టీ కార్యకర్తలపై కక్ష్యపూరితంగా పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసులు నమోదయ్యాయి అని యూత్ కాంగ్రేస్ నాయకులకు తెలియదా…ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని పూర్తి వివరాలతో ప్రెస్ మీట్ పెట్టినుంటే నేనే ఆనంద పడేవాణ్ణి అని అన్నారు. స్వంత పార్టీ కార్యకర్తల సమస్యాత్మక భూముల విషయంలో పక్క పార్టీ నాయకులతో కుమ్మక్కై అనవసర జోక్యం చేసుకుని కేసులు పెట్టించిన విషయం పోలీసు స్టేషన్ లో వెళ్లి తెలుసుకుని తనపై ప్రెస్ మీట్ పెట్టాలని సూచించారు. నాపై తప్పుడు కేసు నమోదు చేయడం విషయంలో ఎవ్వరు ఉన్నారో.. త్వరలో అన్ని విషయాలు ప్రజల ముందుకు తీసుకువస్తానని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -