– రెండు నెలలుగా రూ 19 వేలకు తగ్గని గెలలు ధర
– టన్ను గెలలు ధర రూ.25 వేలు స్థిరీకరించాలి
– పామాయిల్ సాగు దారులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
సెప్టెంబర్ లో సేకరించిన పామాయిల్ గెలలు ధరను ఆయిల్ ఫెడ్ అక్టోబర్ లో ప్రకటిస్తుంది.గత నెలకు చెల్లించాల్సిన టన్ను గెలలు ధర రూ.19400 లు నిర్ణయించారు. ఆగస్ట్ లో టన్ను గెలలు ధర రూ.19107 లు చెల్లించారు. సెప్టెంబర్ టన్ను కు ధర 293 లు స్వల్పంగా పెరిగింది. అయితే ఈ రెండు నెలలు లోనూ టన్ను గెలలు ధర రూ 19 వేలకు తగ్గకుండా నిలకడగా ఉంది.
ప్రస్తుతం పామాయిల్ గెలలు సేకరణ కూలీలు, డ్రైవర్ ల వేతనాలు,డీజిల్ ధరలు పెంపుతో రవాణా వ్యయం పెరిగిన దృష్ట్యా టన్ను గెలలు కనీస ధర రూ.25 వేలుగా స్థిరీకరించే విధంగా ఆయిల్ ఫెడ్, ప్రభుత్వం రైతుకు అండగా ఉండాలని పామాయిల్ సాగు దారులు కోరుతున్నారు.