న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ప్రజలకు మకరసంక్రాంతి, మాఘ బిహు , పొంగల్ శుభాకాంక్షలు తెలిపారు. మకర సంక్రాంతి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. భారతీయ సంస్కృతి -సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే నువ్వులు, బెల్లం తీపితో నిండిన ఈ పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం,శ్రేయస్సు, విజయం నింపాలని కోరారు. సూర్యుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ప్రార్థించారు. అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాలు నేడు మాఘ బిహు పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పొంగల్ పర్వదినం సందర్భంగా తమిళనాడు ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ పండుగ రైతులు, వారి కుటుంబాల జీవితాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ పండగ మనల్ని పోషించే వారికి కృతజ్ఞతలు తెలియజేయడం, తద్వారా మన సమాజాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజలు ఆత్మవిశ్వాసం, ఆశావాదాన్ని కలిగివుండాలని పేర్కొన్నారు. ఈసంవత్సరం ప్రజలందరికీ శ్రేయస్సు, సానుకూలత , మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని తెలిపారు.
ప్రజలకు ప్రధాని సంక్రాంతి, మాఘబిహు శుభాకాంక్షలు
- Advertisement -
- Advertisement -



