Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలానికి ఆదర్శం ప్రధానోపాధ్యాయురాలు..

మండలానికి ఆదర్శం ప్రధానోపాధ్యాయురాలు..

- Advertisement -
  • ఈ విద్యా సంవత్సరం 50 అడ్మిషన్లు
    – సొంత ఖర్చులతో విద్యార్థులకు ఆటో ఏర్పాటు
    పాఠశాలకు 14 డబుల్ డెస్క్ బెంచీలు
    నవతెలంగాణ – పెద్దవూర

    మండలం కేంద్రంలో మూడు ప్రయివేట్ పాఠశాలలు, అయినప్పటికీ ఓ ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థుల కోసం ప్రతిరోజూ ఇంటిటికి తిరిగి విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం, వారిని పాఠశాలలో చేర్చుకునేందుకు ఉపాధ్యాయులతో కలిసి చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేశారు. ఆమె ప్రయత్నం ఫలించడంతో ఈ విద్యా సంవత్సరం 50 అడ్మిషన్లు వచ్చాయి. వివరాలలోకి వెళితే.. నల్గొండ జిల్లా నద్దవూర మండల కేంద్రంలో వున్న ప్రాథమిక పాఠశాలలో  2024-25 విద్యాసంవత్సరం లో 87 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 37 మంది విద్యార్థులు గత సంవత్సరం వెళ్ళిపోయారు. అందులో 20 మంది విద్యార్థులు 5వ పాస్ కావడంతో పెద్దవూర జెడ్పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో చేరారు.

    అరుగురి విద్యార్థులు గురుకులలో సీట్ రావడంతో అక్కడికి వెళ్లారు. నలుగురు విద్యార్థులు వేరే పాఠశాలకు వెల్లగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభములో 50 మంది విద్యార్థులు ఉన్నారు. ఎలాగైనా మరో 50 అడ్మిషన్లు తీసుక రావాలని ఆత్మ విశ్వాసంతో బడిబాట కార్యక్రమం పగడ్బందిగా ఉపాధ్యాయులతో కలిసి నిర్వహించారు. తాను అనుకున్నట్లు 50 కొత్త అడ్మిషన్లు సాధించి, విద్యార్థుల సంఖ్యను 100కు చేర్చారు. పెద్దవూర మండల కేంద్రం సాగర్ చౌరస్తా నుంచి తన సొంత ఖర్చులతో సంవత్సరానికి రూ.40 వేలు ఆటోకు కిరాయి ఇస్తూ 20 మంది పిల్లలు బడికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మిప్రభ.
  • అంతేగాక పాఠశాలలో 14 డబుల్ డెస్క్ బెంచీలు కొత్తగా సొంత ఖర్చులతో చేయించారు. ఉచితంగా పుస్తకాలు, నోట్ బుక్స్ ఇస్తున్నాము. సన్న బియ్యంతో రుచికరమైన భోజనం పెడుతున్నాము. ఇంకా ప్రభుత్వ పథకాలు చాలా అందుతున్నాయని, ఇంటింకీ రోజువెళ్లి చెప్పారు. పూర్తి విశ్వాసంతో ముందడుగు వేసి తాను అనుకున్న 50 అడ్మిషన్లు సాధించగలిగారు.  విద్యార్థుల కోసం పోరాడటం అనేది ఒక సాధన. ఈ విషయంలో మండల విద్యాశాఖాధికారి తరిరాము తమ ఉపాధ్యాయురాలికీ స్కూల్లో పిల్లల చేర్పించే విషయంలో సహాయ సహకారం అందించారు. దీంతో లక్ష్మిప్రభ మండలంలో అందరి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్బంగా మండల ఎంఈఓ తరి రాము ఆమెను అభినందించారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -