పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ..
నవతెలంగాణ – భువనగిరి
పట్టణంలోని తారకరామ నగర్ 32వ వార్డులో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి బాలకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం పోరుబాటలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు లేకుండా కొత్తగా ఉందన్నారు. మున్సిపల్ శానిటేషన్ చేయకపోవడం శోచనీయం దోమలతో డెంగ్యూ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
స్లమ్ ఏరియా కు ప్రత్యేకమైన నిధులు కేటాయించి వార్డులోని డ్రైనేజ్ సమస్య రోడ్ల సమస్యలను పరిష్కరించాలన్నారు వాడిలోని బస్సీ దవాఖానలో డాక్టర్లు గాని మందులు గాని లేవ్వని పేర్కొన్నారు. రెగ్యులర్ డాక్టర్ను వెంటనే నియమించాలని అవసరమైన మందులు ప్రజలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యవర్గ సభ్యులు బద్దెల ఎల్లయ్య పట్టణ కమిటీ నాయకుడు వల్దాస్ అంజయ్య దారా సారంగం అనిమిళ ఆంజనేయులు ధీరవద్ మోహన్ హరి సింగ్ బర్రె ఎల్లయ్య ఎట్టా బోయిన నరేష్ ఎల్లేష్ తూర్పాటి నరసమ్మ పాల్గొన్నారు.
32 వార్డులోని సమస్యను పరిష్కరించాలి: సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES