హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ధర్నా
ఆన్‌లైన్ పనులు చేయించొద్దని డిమాండ్
డీఎంహెచ్‌ఓ వెంకట్‌కు వినతి
నవతెలంగాన-సిటీబ్యూరో
ఆశా వర్కర్లతో ఎన్‌సీడీ, టీబీ ఆన్‌లైన్ ఎంట్రీలు ఆపాలని, వారి సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేష్, గ్రేటర్ హైదరాబాద్ సౌత్ సిటీ కమిటీ అధ్యక్షులు మీనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) గ్రేటర్ హైదరాబాద్, సెంట్రల్, సౌత్ సిటీ కమిటీల ఆధ్వర్యంలో గురువారం సికింద్రాబాద్‌లోని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.వెంకటేష్ మాట్లాడుతూ.. ఆశా వర్కర్లు ఎన్‌సీడీ, టీబీ ఆన్‌లైన్ ఎంట్రీలు సెల్‌ఫోన్‌లో చేయడం వల్ల మెడ నొప్పులు, తలనొప్పి, కండ్ల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆశాలకు సంబంధం లేని ఆన్‌లైన్ పనులను చేయించొద్దని ప్రభుత్వాన్ని కోరారు. రోజుకు 8 గంటల పని, నెల వేతనం ఇవ్వడం లేదన్నారు. కొన్ని సెంటర్లలో ఉదయం 9 గంటలకు అటెండెన్స్ తీసుకోవడం, మధ్యాహ్నం ఒంటి గంటలకు అటెండెన్స్ తీసుకోవడం, ఆన్‌లైన్ లొకేషన్ పెట్టాలని అంటున్నారని తెలిపారు. పనికి తగ్గ పారితోషికం అంటూనే ఇలా వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రూ.లక్ష వేతనాలు తీసుకుంటున్న ఏ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఇలాంటి పరిస్థితి లేదని, ఈ అటెండెన్స్ తీసుకునే విధానాన్ని ఆపాలని కోరారు.
గ్రేటర్ హైదరాబాద్ సౌత్ సిటీ కమిటీ అధ్యక్షులు మీనా మాట్లాడుతూ.. నెలకు 6 ఏఎన్‌సీ తేవాలని ఆశాలకు టార్గెట్ పెట్టడం వల్ల ప్రతినెలా ఫెర్ఫార్మెన్స్ వేసే సందర్భంలో ఏఎన్‌ఎంలు, ఆశాల మధ్య ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. ఆశాలకు సంబంధం లేని పనులను సెంటర్స్‌లో అనేకం చేయించుకుంటూ పనితీరును లెక్కవేసే సందర్భంలో ఏఎన్సీలు సీఎ ప్రభుత్వ డెలివరీలు తదితర టార్గెట్లు రీచ్ కాలేదని డబ్బులు తక్కువ వేసుకున్న పరిస్థితి ఉందని, ఈ టార్గెట్ పద్ధతిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ అధ్యక్షులు టి.యాదమ్మ మాట్లాడుతూ.. పెరుగుతున్న నిత్యావసర ధరలను గమనంలో పెట్టుకొని ఆశాలకు ఫిక్స్‌డ్ నేతనం రూ.18,000 ఇవ్వాలని కోరారు. సెలవులు, యూనిఫాం ఇవ్వాలని, జాబ్‌చార్ట్ ప్రకటించాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎంహెచ్‌ఓ వెంకట్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సెంట్రల్ సిటీ కమిటీ ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి, కోశాధికారి సారాబాబు, ఉపాధ్యక్షులు భాగ్యలక్ష్మి, సౌత్ కమిటీ అధ్యక్షులు కల్పన, ఉపాధ్యక్షులు అంజన్ తదితరులు పాల్గొన్నారు.



