- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఉప్పునుంతల మండల వైద్యాధికారి డాక్టర్ స్వప్నకు సమ్మె నోటీసు అందజేశారు. ఆశ వర్కర్లను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.26,000, పెన్షన్ రూ.10,000 ఇవ్వాలని, పనిగంటలు ఎనిమిది గంటలకు పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



