Monday, March 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆశా వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి 

ఆశా వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి 

- Advertisement -

ఆశ వర్కర్ల నెల్లికుదురు మండల సంఘం 
నవతెలంగాణ – నెల్లికుదురు 

ఆశా వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆ సంఘం నాయకురాలు బత్తిని మహేశ్వరి టీ ఆదిలక్ష్మి కవిత సుజాత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు తెలిపారు. మండల కేంద్రంలో సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తానని గతంలో హామీ ఇచ్చిందని అన్నారు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ మా సమస్యలపై దృష్టి సారించకపోవడం విచారకరమని అన్నారు. మాకు కనీస వేతలో 18 వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ మధ్యలో చలో హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని నిర్వహించగా వెళ్లి అక్కడ మా సమస్యలు చెప్పుకుందామని అనుకునేసరికి ప్రభుత్వం పోలీసులు వచ్చి మమ్ములను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు సంబంధిత అధికారులు మాపై మా కష్టంపై దృష్టి సారించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -