సీసీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు
నవతెలంగాణ – వనపర్తి
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ఎదురయ్యే సమస్యలన్నింటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని సీసీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఉపాధి పనుల పరిశీలనలో భాగంగా వనపర్తి మండలం రాజపేట, రాజపేట పెద్దతండ గ్రామాలలో ఉపాధి కూలీల పని ప్రదేశంలో కి వెళ్లి కూలీల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ.. పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, నూతన వి బి జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వల్ల నూటికి 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరించేదని, 10 శాతం నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించేదని కానీ నేడు విబి జి రాంజీ చట్టం వల్ల కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ 40 శాతం నిధులు కేటాయించాలని చట్టంలో పేర్కొనడం అన్యాయం అన్నారు. కాబట్టి విబి జి రాంజీ చట్టాన్ని రద్దుచేసి పాత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు కండ్లు ఫోటో తీసే ఆన్లైను హాజరు పద్ధతిని రద్దు చేయాలని గతంలో వలె గ్రూప్ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు.
దాదాపు రెండు నెలలు పని చేసిన కూళ్లు చెల్లించలేదని కూలి ఇవ్వకపోతే జీవించడం ఎలా అని కాబట్టి వెంటనే బకాయి పడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ చట్టం అమలులోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ వర్తించదని 200 యూనిట్ల కరెంటు ఉచితంగా కాక డబ్బులు కేటాయించాల్సి వస్తుందని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తారని విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన నాలుగు లేబర్ కోడ్స్ కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయని, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, బేరా రసారాలు ఆడే హక్కు, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ తదితర చట్టాలన్నీ రద్దయిపోతున్నాయని కాబట్టి పాత 29 కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నూతన విత్తన చట్టం కార్పొరేట్ సంస్థలకు, స్వదేశీ,విదేశీ గుత్తా కంపెనీలకు అనుకూలంగా,పేద రైతులకు వ్యతిరేకంగా ఉందని ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజపేట శ్రీనివాసులు, శంకరయ్య,రవీందర్, బాలరాజు,అనిత, కే. లక్ష్మి,రాజపేట పెద్ద తండా జాంగిర్,నార్య, శంకర్,వశ్యరామ్,ధర్మి, శాంతమ్మ,చంద్రు నాయక్,సాలమ్మ తదితర కూలీలు పాల్గొన్నారు.



