నవతెలంగాణ – రాయపర్తి
విశ్రాంతి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని విశ్రాంతి ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు అబ్బోజు రామ్మోహన చారి అన్నారు. గురువారం మండల కేంద్రంలో విశ్రాంతి ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉద్యోగం నుండి రిటైరైన తరువాత ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు సమయానికి అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ బ్యాంకు ఖాతాల్లో జమచేయాలన్నారు. గతంలో పదవీ విరమణ చేసిన రోజే ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయో జనాలను చెక్కు రూపంలో ఇచ్చే వారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడం బాధాకరం అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి న్యాయం చేయాలని కోరారు. విశ్రాంత ఉద్యోగులు నిరసన తెలియజేయకముందే డిఏలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పెన్షన్ దారులకు ఒకే రకమైన విధానం ఉండేలా చూడాలని తెలిపారు. సిపిఎస్ ను రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వానికి కోరారు. ఈ సమావేశంలో సీనియర్ సిటిజన్స్ కమిటీ సమన్వయకర్త రావుల భాస్కర్ రావు, కమిటీ సభ్యులు బిల్లా విజయ లక్ష్మి, ఉప్పు రామ్మూర్తి, ఎండి ఉస్మాన్, చంద్రయ్య శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
విశ్రాంతి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES