కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని కల్లుగీత కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదనీ, తక్షణమే గీత కార్మికులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందిచాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఐదు లక్షలకు పైగా కల్లుగీత కార్మిక కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. రేండేండ్ల కాలంలో చెట్లెక్కి కిందపడి వృత్తికి దూరమైన కార్మికులు 850 మంది ఉన్నారని పేర్కొన్నారు. 140 మంది చనిపోయారనీ, మరో 170 మంది శాశ్వతంగా వికలాంగులయ్యారని గుర్తు చేశారు. వారికి ఇస్తామన్న రూ. ఐదు లక్షలు ఇవ్వలేదని పేర్కొన్నారు.
రూ. 14 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఎక్స్‌గ్రేషియా రూ.5లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పెంచుతామన్న కామారెడ్డి డిక్లరేషన్ హామీ నేటికీ అమలు చేయడం లేదని పేర్కొన్నారు. నీరాకేఫ్‌ను అభివృద్ధి చేసి ఆ కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునే బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం ఇందిరాపార్క్ వద్ద పెద్ద ఎత్తున దీక్షా కార్యక్రమం నిర్వహించి, ఆందోళన చేశారని తెలిపారు. ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులు చేసే పోరాటాలకు మద్దతునిస్తూ అవసరమైతే ప్రత్యక్ష పోరాటాలకు సీపీఐ(ఎం) సిద్ధమవుద్దని హెచ్చరించారు.
గీత కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



