- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలో వారు విలేకరులతో మాట్లాడారు. గత 4 నెలలుగా బిల్లులు రావడంలేదని చెప్పారు. ఇకనైనా ప్రభుత్వం పెండింగ్ బిల్లులను విడుదల చేయాలన్నారు. తమకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. తమకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.
- Advertisement -