అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయాలి : ఆవాజ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఖయ్యూం, సలీం
కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-సంగారెడ్డి
మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, వారి అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆవాజ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఖయ్యూం, సలీం అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆవాజ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఖయ్యూం, సలీం మాట్లాడుతూ.. విద్య, ఉపాధి, గృహాలు, రేషన్ కార్డులు మైనారిటీ సంక్షేమ పథకాలు, బస్తీలలోని డ్రైనేజీ, వీధిలైట్లు, షాదీ ముబారక్ బిల్లుల తదితర సమస్యలు పరిష్కరించాలని అన్నారు. అలాగే అర్హులైన ముస్లిం కుటుంబాలకు ఇప్పటికీ గృహాలు మంజూరు లేకపోవడం, కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, పాత రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చకపోవడం వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కొత్త రేషన్ కార్డులు జారీ చేసి, పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డు సమస్యలు పరిష్కరించాలన్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. షాదీ ముబారక్ పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కారం చేయాలని తెలిపారు. వార్డుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మైనార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీంటిని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మైనార్టీ విద్యాసంస్థల్లో టీచర్ పోస్టులు, లెక్చరర్ పోస్టులు, మంచినీళ్లు, బిల్డింగులు, వాష్ రూమ్స్, కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. అవసరమైనచోట కొత్తగా విద్యాసంస్థలు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అవాజ్ నాయకులు గౌస్, ఆసిఫ్, భాసీద్, బాషా, ముతబీర్ తదితరులు పాల్గొన్నారు.
మైనారిటీల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



