– విశ్రాంత ఉద్యోగుల సారధ్య కమిటీ నాయకులు
– ఆర్టీసీ వైస్ చైర్మెన్, ఎండీ నాగిరెడ్డికి వినతి
నవ తెలంగాణ – ముషీరాబాద్
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని విశ్రాంత ఉద్యోగుల సారధ్య కమిటీ నాయకులు పి.చంద్రారెడ్డి, పట్టాభి లక్ష్మయ్య, రంగారావు, వెంగళ కనకయ్య అన్నారు. విశ్రాంతి ఉద్యోగుల సారధ్య కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్సు భవన్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ వైస్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీలో 30-40 ఏండ్లుగా వివిధ హోదాల్లో సేవలందించి ఏప్రిల్ 2017 నుంచి ఏప్రిల్ 2024 మధ్య రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను ఇంకా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌కాష్‌మెంట్ డిఫరెన్స్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయి ఉన్న టెర్మినల్ లీవ్ ఎన్‌కాష్‌మెంట్ డబ్బులు డిసెంబర్ 2025 వరకు చెల్లించాలని, ఆగస్టు 2025-డిసెంబర్ 2025 మధ్య రిటైర్ అయిన ఉద్యోగుల గ్రాట్యుటీ, ఇతర సెటిల్‌మెంట్ డబ్బులు కూడా ఇవ్వాలని అన్నారు. అలాగే 2013, 2017 జీతభత్యాల సవరణలను పీఎఫ్ కమిషనర్‌కు పంపించి పెన్షన్ పెంపునకు సహకరించాలన్నారు. తిరస్కరణకు గురైన పీఎఫ్, పెన్షన్ పత్రాలను సరిచేయించి, డీడీ చెల్లించిన అందరికీ హయ్యర్ పెన్షన్ మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కట్ట ప్రకాష్, ఎండీ హమీద్ అలీ, ఎం.చిన్నయ్య, సత్యపాల్, నజీరుద్దీన్, ఎం.ఎస్.రావు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



