Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వికలాంగుల సమస్యలను పరిష్కరించాలి

వికలాంగుల సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -

– జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం
నవతెలంగాణ – కామారెడ్డి, బాన్సువాడ 

వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం బాన్సువాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యావంశీ  అతిథిగా హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడు కోల బాలరాజ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వికలాంగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకు రూ.6,000 పెన్షన్, వృద్ధులకు రూ.4,000 పెన్షన్ అందిస్తామని ఇచ్చిన హామీలు అమలు కాలేదని నాయకులు విమర్శించారు.

వికలాంగుల సదరం, అంత్యోదయ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాజానర్సు, జిల్లా ప్రచార కార్యదర్శి శివరాజ్, ముఖ్య కార్యకర్త రాజేందర్, డివిజన్ ఇన్‌చార్జ్ కొండా వెంకట్ స్వామి, పోషాల కృష్ణ, సంఘప్ప, గంగాధర్, రామలీల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -