నాయి బ్రాహ్మణ సేవా సంఘం..
రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయగిరి సమ్మయ్య నాయి..
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ నాయి బ్రాహ్మణుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి, ఆదుకోవాలని తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ గిరి సమ్మయ్య నాయి సోమవారం విజ్ఞప్తి చేశారు. మండలంలోని కొయ్యురు లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారక్క అభివృద్ధి కార్యక్రమానికి మంగళవారం వస్తున్న నేపథ్యంలో మేడారం దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కళ్యాణ కట్టలో తల నీలాలు సమర్పిస్తున్నారని తెలిపారు.
కుల వృత్తి చేస్తున్న నాయి బ్రాహ్మణులకు గత ప్రభుత్వం 4వ తరగతి ఉద్యోగులగా గుర్తిస్తామని, ఎమ్మెల్సీ చేస్తామని హామీ అమలు చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వము నాయి బ్రాహ్మణుల సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని కోరారు. 10కళ్యాణ కట్టను పెంచాలని, 50 సంవత్సరాలు పైబడిన వారికి ఆసరా పింఛన్ మంజూరు చేయాలని, కులవృత్తి చేసుకునే విధంగా ప్రత్యేక జీవో తీయాలని కోరారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల రుణాలు మంజూరు చేయాలని, ప్రతి దేవస్థానంలో ఒక డైరెక్టర్ నామినేట్ పోస్ట్ కల్పించాలని విన్నవించారు.
నాయి బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES