Wednesday, October 22, 2025
E-PAPER
Homeఆదిలాబాద్గిరిజన హాస్టల్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి 

గిరిజన హాస్టల్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి 

- Advertisement -

బెస్ట్ అవలేబుల్ స్కూల్ ఫీజు బకాయిలను చెల్లించాలి 
గిరిజన శాఖ మంత్రికి టీఏజీఎస్ వినతి  
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్

గిరిజన హాస్టల్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని జీవో 64 ను రద్దు చేసి కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని, బెస్ట్ అవలేబుల్ ఫీజు బకాయిలను చెల్లించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) సంఘం నాయకులు కోరారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి, ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్  రాష్ట్ర సచివాలయం లో కలిసి వినతి పత్రం సమర్పించారు  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 43 రోజులుగా గిరిజన వర్కర్స్ సమ్మె లో ఉండటం మూలంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే సమస్యలు పరిష్కరించాలని కోరారు. బెస్ట్ అవలేబుల్ ఫీజు బకాయిలను పూర్తి స్థాయి లో చెల్లించాలని కోరారు ఈ విషయంలో మంత్రి సానుకూలంగా స్పందించారు. రేపు సంబంధిత అధికారులు, వర్కర్స్ నాయకత్వం తో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో హాస్టల్ డైలీ వేజ్ మరి అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు బి మధు, ఎం పాపారావు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రజినికాంత్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -