నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాలో కందుల కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని స్థానిక సంస్థల, రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు,డిఎం మార్క్‌ఫెడ్‌తో కలిసి సోమవారం ఛాంబర్ డిఎల్‌పిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన మద్దతు ధరకు రైతుల నుంచి కందుల కొనుగోలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల నిర్వహణ, తూకం, నాణ్యత పరిశీలనలో పారదర్శకత పాటించాలని తెలిపారు.ఫిబ్రవరి 1 నుండి ప్రారంభించాలని అదనపు కలెక్టర్ సూచనలు చేశారు. జిల్లాలో దాదాపుగా 4400 ఎకరాలు కందులు సాగు అయినవి. దీనికిగాను 25 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేయడం జరిగింది. కొనుగోలు ప్రక్రియ మొత్తం సొసైటీల ద్వారా జరగాలని ఆదేశించారు. ఒక క్వింటాలు కందులు 8000 రూపాయలు ఎంఎస్పీగా నిర్ధారించడం జరిగింది. తేమ12 శాతం కంటే కూడా తక్కువ ఉండే విధంగా రైతులు జాగ్రత్త వహించి సెంటర్లకి తీసుకురావాల్సిందిగా సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి,మార్క్‌ఫెడ్ జ్యోతి, డీసీఓ మురళి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కందుల కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించాలి: జిల్లా అదనపు కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



